నాన్న (కవిత)



మీ గుండె తొక్కుతూ వేసిన నా తొలి అడుగులు

మీ వీపు పై ఊరేగుతూ చేసిన గుర్రపు స్వారీలు

నేను పడకుండా పట్టుకున్న నా చిటికెన వేలు

మీ చేతి తో దిద్దించిన జీవితపు తొలి ఓనమాలు

నిదరోయే వేళ మీరు చెప్పిన కమ్మని కధలు

మా భవితకై  పరితపించిన ప్రతి రాత్రి పగలు

ఇది మీరు ఇచ్చిన జీవితము నాన్న

దీన్ని వెలకట్టలేము.

     --శ్రీముఖి ,9th Class,E/M

       S.N.A.M.Z.P.S.School,Narsapuram (Vill) Dummugudem(Mandal)

       KMM (DT)

********************************************************************************
అమ్మే నా దైవం (కవిత)


                                                                                                     Photo: Gandhi Sir. 
అమ్మే నా దైవం (కవిత)

అమ్మంటే అందరికిష్టం -అమ్మలేని జీవితం కష్టం

అమ్మకు పిల్లలంటే ఇష్టం-అందుకే నాకు అమ్మంటే ఇష్టం

వచ్చింది వాన (కవిత)

వచ్చింది వచ్చింది వాన -చుట్టంగా వచ్చింది వాన

చిటపటగా వచ్చింది వాన-నాకెంతో నచ్చింది వాన

పెంచుదాం చెట్లు -మనకెంతో నచ్చేటట్లు

అందంగా ఎదిగేటట్లు -రుచిగా పండ్లు తినేటట్టు.

  రచన:డి.దివ్యశ్రీ
          7 వ తరగతి (E/M),ఎస్.ఎన్.ఏ.ఎం.జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల
           నర్సా పురం (పోస్ట్),దుమ్ముగూడెం (మండలం) ఖమ్మం (జిల్లా) .

*   *  *  * *


అమ్మే నా దైవం (కవిత)

అమ్మ నువ్వే నా దైవం-నువ్వు లేక నేను లేను

నువ్వేగా నన్ను పుట్టించింది -నవ మోసాలు మోసింది

ఈ లోకం లోకి నన్ను తెచ్చావు- నన్ను ఉన్నత స్థాయి లో ఉంచావు

నేను ఉన్నత శిఖరాలని అధిరోహిస్తాను -నీ మాట నేను నిలబెడతాను

అమ్మా నీ మాట ప్రకారం చేస్తాను.

చెట్లు- చెట్లు

పెంచాలి గాలికోసం  చెట్లు-కట్టాలి ఎక్కడానికి మెట్లు

కడతారు జారిపడితే కట్లు - ఎందుకు కుదురుండక పాట్లు

గాలి వచ్చింది.

వచ్చింది వచ్చింది గాలి-చుట్టంగా వచ్చింది గాలి

చల్లంగా వచ్చింది గాలి-నాకెంతో నచ్చింది గాలి.

రచన: మహితా గ్రేస్ ,7 వ తరగతి (E/M) ,ఎస్.ఎన్.ఏ.ఎం.జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల
           నర్సా పురం (పోస్ట్),దుమ్ముగూడెం (మండలం) ఖమ్మం (జిల్లా) .

4-12-2014

Inspire జిల్లా స్థాయి సైన్స్ సదస్సు

Inspire జిల్లా స్థాయి సైన్స్ సదస్సు లో నందిగామపాడు విధ్యార్థులు

ది.3-8-2014 నుండి 5-8-2014 దాకా సత్తుపల్లి పట్టణం లో గల జ్యోతి నిలయం లో జిల్లాస్థాయి Inspire సైన్ ప్రోగ్రాం కన్నులవిందుగా ..కోలాహలంగా జరిగింది.ఖమ్మం జిల్లా నాలుగుచెరగులనుంచి విధ్యార్థినీ విధ్యార్థులు దీని లో ఉత్సాహంగా ఫాల్గొన్నారు.




జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ,నందిగామపాడు నుంచి ఇద్దరు విధ్యార్థులు ఈ కార్యక్రమంలో ఫాల్గొన్నారు.తొమ్మిదవతరగతి చదువుతున్న కె.సాగర్,జి.రమేష్ లు భౌతిక శాస్త్రం,జీవ శాస్త్రం లకి సంబందించిన ప్రయోగాల యొక్క ప్రాజెక్ట్ వర్క్ లను అక్కడ ప్రదర్శించారు. దీనికి గాను  ఉపాధ్యాయులు ఎం.ఆదినారాయణ గారు (జీవశాస్త్రం),సి.హెచ్.శ్రీనివాస్ గారు (భౌతికశాస్త్రం) లకి సంబందించి మార్గదర్శనం చేశారు.ఇద్దరు విధ్యార్థులు వారి అనుభవాన్ని వివరిస్తూ ఇలాంటి కార్యక్రమాల్లో ఫాల్గోవడంవల్ల అనేకమంది తోటి విధ్యార్థుల యొక్క ప్రాజెక్టులు చూడగలిగామని,చాలా విజ్ఞానదాయకం గా అనిపించిందని తెలిపారు.జి.రమేష్ " The sense of touch and hearing" అనే ప్రాజెక్ట్ ని,కె.సాగర్ "Automatic street light controller"అనే ప్రాజెక్ట్ ని ప్రదర్శించారు.నిర్వాహకులు అందజేసిన ప్రోత్సాహక  సర్టిఫికెట్ లను ప్రధానోపాధ్యాయులు వి.కాళేశ్వర రావు గారు సంబందిత విధ్యార్థులకు,ఉపాధ్యాయులకు అందజేశారు.      






బాల గౌతమి పిల్లలకోసం నడపబడుతున్న ద్వైమాసిక వెబ్ మేగజైన్.బాలలు ఆనందించడానికి,ఆస్వాదించడానికి,సృజనాత్మకతను పంచుకోవడానికి ఈ వెబ్ మేగజైన్ ఒక వేదికలా ఉపయోగపడాలనేది మా అభిమతం ...!దీనిలోని రకరకాల శీర్షికల్ని గమనించి మీకు ఆసక్తి గలిగిన అంశాల్ని,రచనల్ని,చిత్రాలని మాకు పంపించమని బాలలని కోరుతున్నాం.

మీ రచనలు ఇంగ్లీష్ లోనైనా ఉండవచ్చు లేదా తెలుగు లోనైనా ఉండవచ్చు ..!అయితే పూర్తి చిరునామా ,మీరు చదువుతున్న తరగతి తప్పనిసరిగా తెలియపరచాలి.ప్రత్యేకించి బాల చిత్రకారులకి స్వాగతం ..!కథలు,జోక్స్,జనరల్ నాలెడ్జ్ బిట్స్,బొమ్మలు మాత్రమే కాకుండా ఇంకా కొన్ని విన్నూత్న శీర్షికలు మన వెబ్ మేగజైన్ లో ఉన్నాయి. వాటిలో  ప్రచురణార్ధమై కూడా మీరు పంపవచ్చు..!

పర్యాటకం ...అనే శీర్షికకి మీరు యేదైనా ఊరు లేదా నూతన ప్రదేశం వెళ్ళినప్పుడు అక్కడ మీరు పొందిన అనుభూతులని రాయవచ్చు.బాలగౌతమి యెటువంటి లాభాపేక్షలేని వెబ్ పత్రిక.దీని గూర్చి మీ మిత్ర బృందానికి తెలియబర్చండి.

అసలి విషయానికి వస్తున్నా...మీ రచనలు గట్రా యెలా పంపించాలనేగదా మీ సందేహం..?

రెండు విధాలుగా పంపించవచ్చు.

1. తెలుగు రచనలైతే  యూనికోడ్ లో టైప్ చేసి మాకు E-mail చేయండి లేదా తెలుగు లో డి.టి.పి. చేసి ఆ ప్రతుల్ని మాకు e-mail చేయవచ్చు. .చిత్రాకారులు తమ చిత్రాల్ని Scan చేసి E-mail చేయాలి. మీకు యెలాంటి సందేహాలున్నా మాకు Mail చేసి అడగవచ్చు.

2.సరే ,ఇంగ్లీష్ రచనలయితే మాములుగానే మాకు mail చేయవచ్చు.

మా E-mail id:   gitika232@gmail.com



We Invite Articles in the Language of English Too..! Girt Up, Children..!Send Your Short Stories,Jokes,Sketches,G.k.bits,Photos of Memorable experiences in your School. You can also write about your place or Entourage.No doubt,Your Drawings always be solicited.
                     One more thing,Don't forget sending your color Pass port size photo along with your contribution.This website is of a Non-Profit organisation,So you don't need to pay any fee at any stage.
                    HOW TO SEND: Simply mail your write-ups' & photos to our E-mail Id: gitika232@gmail.com

Phone No: 78935 41003

                                            ........కె.వి.వి.సత్యనారాయణ మూర్తి.
                                                     (ప్రధాన సంపాదకులు,బాల గౌతమి)