కథలు

                            దురాశ (కథ) 
                  --E సంధ్య  (10 th class)

వీరయ్య,సీతయ్య అన్నదమ్ములు.అన్న వీరయ్య ధనవంతుడు.సీతయ్య పేద వాడు.పండుగ వచ్చిందంటే వీరయ్య ఇంట్లో వాళ్ళంతా కొత్త బట్టలతో కళ కళ లాడేవారు.సీతయ్య ఇంట్లో మాత్రం పండుగ కూడా సాదాసీదాగా గడిచి పోయేది.ఓ పండుగకైతే ఇంట్లో వంట చేసుకోలేదు.పిల్లల పరిస్థితిని చూసి పండుగ ఖర్చుల కోసం అన్నను డబ్బు సాయం అడిగాడు సీతయ్య.ఇంటికి వచ్చిన తమ్ముణ్ణి హేళనగా మాట్లాడి పంపేశాడు.దాంతో సీతయ్య ఓ చెట్టు క్రింద దిగాలుగా కూర్చున్నాడు.

సీతయ్యను పేదరాసి పెద్దమ్మ చూసి 'యేంటి బాబు...దిగులుగా కూర్చున్నావ్ 'అని అడిగింది.సీతయ్య జరిగినదంతా చెప్పాడు.పెద్దమ్మ సీతయ్యను తనతో పాటు తీసుకెళ్ళి తన ఇంట్లో ఉన్న తిరగలిని అతడికి ఇచ్చి ...దీని ముందు నిలబడి నువ్వు యేదైనా కోరుకుంటే అది వచ్చేస్తుంది.ఇచ్చినవి చాలా కనిపించగానే ఓ యెర్రటి గుడ్డను దీనిపైన కప్పి పెట్టూఅని చెప్పింది.సీతయ్య ఎంతో సంతోషంగా ఆ తిరగలిని తీసుకుని ఇంటికి వచ్చి కావలసినవన్ని కోరుకున్నాడు.తరవాత దానిపై యెర్ర గుడ్డ కప్పాడు.దాంతో అతడి భార్యా పిల్లలు యెంతో సంతోషించారు.

అప్పటినుంచి తిరగళి ద్వారా వచ్చిన వాటిని మార్కెట్ లో అమ్మి తన అవసరాలు తీర్చుకునేవాడు.సీతయ్య ధనవంతుడు అవడం చూసి వీరయ్యకు తమ్ముడి పై  అసూయ,ఈర్ష్య  కలిగింది.సీతయ్య సంపాదన రహస్యం తిరగలి అని పసిగట్టి ,ఓ రోజు దాన్ని దొంగిలించాడు.దాన్ని తీసుకుని నగరం వదిలిపోవడానికి రాత్రికిరాత్రే పడవలో ప్రయాణమయ్యాడు.పడవలో తిరగలి పనితనాన్ని పరీక్షించాలనుకున్నాడు వీరయ్య.దానిముందు నిలబడి "నాకు బంగారం కావాలి " అని కోరాడు.అంతే...!వెంటనే దాన్నుంచి బంగారం వచ్చింది.కాసేపటికి గుట్టలు గుట్టలుగా పోగయ్యింది.ఆయితే వీరయ్యకి దాన్ని యెలా ఆపాలో తెలియలేదు.దాంతో బరువు యెక్కువై నడిసముద్రంలో పడవ మునగ సాగింది.పడవలోని బంగారంతో పాటు వీరయ్య కూడా మునిగి పోయాడు.