టిప్స్

పెరుగు మంచి గా తోడుకోవాలంటే గిన్నెని ముందు పటిక ముక్కతో రుద్దాలి.

బట్టల రంగు పాడవకుండా ఉండాలంటే నీళ్ళలో తడిపేటప్పుడు ఒక టేబుల్ స్పూన్ వెనిగర్ కలపాలి.

గులాబ్ జాములు పొంగినట్లు మెత్తగా రాకపోతే ...పాకంతో సహా వాటిని కుక్కర్లో పెట్టి పది నిమిషాలు ఉడికించాలి.

వంట చేసిన తరవాత గది అంతా ఘాటు వాసన  వస్తూంటే ఒక గిన్నెలో నీరుపోసి దాంట్లో దాల్చిన చెక్క వేసి మరిగిస్తే గది చక్కని పరిమళాలు వెద జల్లుతుంది.

రెండు స్పూన్ల తాజా తులసి రసాన్ని మరుగుతున్న నీటిలో కలిపి చల్లార్చిన తరువాత ఆ నీటితో ముఖం కడుక్కోవాలి.ఇలా చేస్తే మొటిమలు తగ్గుతాయి.

కాఫీకీ మరింత రుచి ,సువాసన రావాలంటే ఫిల్టర్లో వేడి నీళ్ళు పోసేటప్పుడు చిటికెడు ఉప్పు వేయాలి.

                                 --బి.ఎస్.వి.కె.ప్రసాద్  (10 th class)