వ్యాసాలు


నా ప్రియమైన నాయకుడు-లాల్ బహదూర్ శాస్త్రి
                                                                                           --ఎన్.ఎస్.మంజు రసజ్ఞ

నా ప్రియమైన నాయకుడు లాల్ బహదూర్ శాస్త్రి.ఆయన ఉత్తర ప్రదేష్ లో మొగల్ సరాయ్ అనే గ్రామంలో జన్మించాడు.అతని తల్లి పేరు రాం దులారి దేవి,తండ్రి శారదా ప్రసాద్ .అతని ముద్దు పేరు నానే.లాల్ బహదూర్ ప్రాధమిక విద్య మొగల్ సరాయ్ లో పూర్తి చేసి ఉన్నత విద్య కాశీ లో చదివాడు.లాల్ బహదూర్ కి అంక గణితం అంటే తలనొప్పి.ఇంగ్లిష్,చరిత్ర అంటే మాత్రం తగని అభిమానం.ఆయనకి ఈత అన్న,నటన అన్న ప్రీతి.కాశీ విద్యా పీఠం లో చేరి తత్వ శాస్త్రంలో శాస్త్రి  డిగ్రీ సంపాదించి శాస్త్రి అయ్యాడు.
ఆయన లాలా లజపతిరాయ్ స్థాపించిన servants of people society లో చేరి ప్రజాసేవ చేశాడు.క్రి.శ.1927 వ సంవత్సరంలో లలితా దేవిని వివాహం చేసుకున్నాడు.ఆయన గాంధిజీ ప్రారంభించిన సహాయ నిరాకరణ ఉద్యమంలో ఫాల్గొని అనేకసార్లు జైలుకి వెళ్ళాడు.ఆయన క్రీ.శ.1947 వ సంవత్సరం ఉత్తర ప్రదేష్ ప్రభుత్వంలో రవాణా పోలీస్ శాఖా మంత్రిగా చేరాడు.తదుపరి 1952 లో కేంద్రంలో రైల్వే  మంత్రిగా నియమించబడ్డాడు.
క్రీ.శ.1964 లో జవహర్లాల్ మరణాంతరం లాల్ బహదూర్ శాస్త్రి భారత ప్రధాని పదవి స్వీకరించాడు."జై జవాన్,జై కిసాన్" నినాదంతో భారతీయులలో స్ఫూర్తిని కలిగించిన లాల్ బహదూర్ శాస్త్రి చిరస్మరణీయుడు.

(Master N.S.Manju Rasgna is studying 4th class in the St.Pauls Lutheran School,Bhadrachalam)