కవితలులేదు..! 


 టైం లేకుండా రోజు లేదు..! 

నక్షత్రం లేకుండా ఆకాశం లేదు..!

పువ్వు లేకుండా పరిమళం లేదు..!

నీ స్నేహం లేకుండా నేను లేను..!

                        --శ్యాం (10 వ తరగతి)అమ్మ


అ అంటే అనురాగం

మ్మ అంటే మమకారం

ఈ రెండు పదాలను కలిపితే అమ్మ అని అర్ధం

అమ్మ లేని జీవితం వ్యర్ధం

                        --పి.స్వాతి (10 వ తరగతి)  అమృత గీతం

జననం ఒక సుప్రభాతం

 మరణం ఒక సంధ్యా గీతం

 రెండింటి మధ్య జీవితం

 సుఖ దుఖ సంగమం

 అందులో నీ స్నేహం ఒక అమృత గీతం

                    -- ఎం.సుహాసిని (10 వ తరగతి)     
జీవితం

చిగురించే ఆకు వంటిది బాల్యం

ఎగిరే పక్షి వంటిది యవ్వనం

ఆరిపోయే దీపం వంటిది ముసలితనం

జీవితంలో మనకెందుకు ఈ ఆరాటం..?

                           --పి.సాయి కృష్ణ (10 వ తరగతి)