Inspire జిల్లా స్థాయి సైన్స్ సదస్సు

Inspire జిల్లా స్థాయి సైన్స్ సదస్సు లో నందిగామపాడు విధ్యార్థులు

ది.3-8-2014 నుండి 5-8-2014 దాకా సత్తుపల్లి పట్టణం లో గల జ్యోతి నిలయం లో జిల్లాస్థాయి Inspire సైన్ ప్రోగ్రాం కన్నులవిందుగా ..కోలాహలంగా జరిగింది.ఖమ్మం జిల్లా నాలుగుచెరగులనుంచి విధ్యార్థినీ విధ్యార్థులు దీని లో ఉత్సాహంగా ఫాల్గొన్నారు.




జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ,నందిగామపాడు నుంచి ఇద్దరు విధ్యార్థులు ఈ కార్యక్రమంలో ఫాల్గొన్నారు.తొమ్మిదవతరగతి చదువుతున్న కె.సాగర్,జి.రమేష్ లు భౌతిక శాస్త్రం,జీవ శాస్త్రం లకి సంబందించిన ప్రయోగాల యొక్క ప్రాజెక్ట్ వర్క్ లను అక్కడ ప్రదర్శించారు. దీనికి గాను  ఉపాధ్యాయులు ఎం.ఆదినారాయణ గారు (జీవశాస్త్రం),సి.హెచ్.శ్రీనివాస్ గారు (భౌతికశాస్త్రం) లకి సంబందించి మార్గదర్శనం చేశారు.ఇద్దరు విధ్యార్థులు వారి అనుభవాన్ని వివరిస్తూ ఇలాంటి కార్యక్రమాల్లో ఫాల్గోవడంవల్ల అనేకమంది తోటి విధ్యార్థుల యొక్క ప్రాజెక్టులు చూడగలిగామని,చాలా విజ్ఞానదాయకం గా అనిపించిందని తెలిపారు.జి.రమేష్ " The sense of touch and hearing" అనే ప్రాజెక్ట్ ని,కె.సాగర్ "Automatic street light controller"అనే ప్రాజెక్ట్ ని ప్రదర్శించారు.నిర్వాహకులు అందజేసిన ప్రోత్సాహక  సర్టిఫికెట్ లను ప్రధానోపాధ్యాయులు వి.కాళేశ్వర రావు గారు సంబందిత విధ్యార్థులకు,ఉపాధ్యాయులకు అందజేశారు.      


3 comments:

  1. It is a very good attempt to initiate especially and exclusively for children and we should congratulate the founders for the purpose. There is a need to give suitable publicity to this unusual website to all educational institutions with an encouragement to participate and involve as contributors with which it will surely convert as magnum opus i.e. goo encyclopedia. Keep it up and all the best. kompella sarma. www.teluguradham.blogspot.com

    ReplyDelete