నాన్న (కవిత)



మీ గుండె తొక్కుతూ వేసిన నా తొలి అడుగులు

మీ వీపు పై ఊరేగుతూ చేసిన గుర్రపు స్వారీలు

నేను పడకుండా పట్టుకున్న నా చిటికెన వేలు

మీ చేతి తో దిద్దించిన జీవితపు తొలి ఓనమాలు

నిదరోయే వేళ మీరు చెప్పిన కమ్మని కధలు

మా భవితకై  పరితపించిన ప్రతి రాత్రి పగలు

ఇది మీరు ఇచ్చిన జీవితము నాన్న

దీన్ని వెలకట్టలేము.

     --శ్రీముఖి ,9th Class,E/M

       S.N.A.M.Z.P.S.School,Narsapuram (Vill) Dummugudem(Mandal)

       KMM (DT)

********************************************************************************
అమ్మే నా దైవం (కవిత)


                                                                                                     Photo: Gandhi Sir. 
అమ్మే నా దైవం (కవిత)

అమ్మంటే అందరికిష్టం -అమ్మలేని జీవితం కష్టం

అమ్మకు పిల్లలంటే ఇష్టం-అందుకే నాకు అమ్మంటే ఇష్టం

వచ్చింది వాన (కవిత)

వచ్చింది వచ్చింది వాన -చుట్టంగా వచ్చింది వాన

చిటపటగా వచ్చింది వాన-నాకెంతో నచ్చింది వాన

పెంచుదాం చెట్లు -మనకెంతో నచ్చేటట్లు

అందంగా ఎదిగేటట్లు -రుచిగా పండ్లు తినేటట్టు.

  రచన:డి.దివ్యశ్రీ
          7 వ తరగతి (E/M),ఎస్.ఎన్.ఏ.ఎం.జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల
           నర్సా పురం (పోస్ట్),దుమ్ముగూడెం (మండలం) ఖమ్మం (జిల్లా) .

*   *  *  * *


అమ్మే నా దైవం (కవిత)

అమ్మ నువ్వే నా దైవం-నువ్వు లేక నేను లేను

నువ్వేగా నన్ను పుట్టించింది -నవ మోసాలు మోసింది

ఈ లోకం లోకి నన్ను తెచ్చావు- నన్ను ఉన్నత స్థాయి లో ఉంచావు

నేను ఉన్నత శిఖరాలని అధిరోహిస్తాను -నీ మాట నేను నిలబెడతాను

అమ్మా నీ మాట ప్రకారం చేస్తాను.

చెట్లు- చెట్లు

పెంచాలి గాలికోసం  చెట్లు-కట్టాలి ఎక్కడానికి మెట్లు

కడతారు జారిపడితే కట్లు - ఎందుకు కుదురుండక పాట్లు

గాలి వచ్చింది.

వచ్చింది వచ్చింది గాలి-చుట్టంగా వచ్చింది గాలి

చల్లంగా వచ్చింది గాలి-నాకెంతో నచ్చింది గాలి.

రచన: మహితా గ్రేస్ ,7 వ తరగతి (E/M) ,ఎస్.ఎన్.ఏ.ఎం.జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల
           నర్సా పురం (పోస్ట్),దుమ్ముగూడెం (మండలం) ఖమ్మం (జిల్లా) .

4-12-2014

No comments:

Post a Comment